Thu Jan 29 2026 09:09:56 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi: అయోధ్యకి చిరు, చరణ్ పయనం.. మెగాఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి..
అయోధ్యకి బయలుదేరబోతున్న చిరంజీవి, రామ్ చరణ్కి శుభాకాంక్షలు తెలిపేందుకు మెగా ఇంటి వద్దకి ఫ్యాన్స్ చేరుకొని సందడి చేస్తున్నారు.

Chiranjeevi - Ram Charan : రేపు (జనవరి 22) అయోధ్యలో జరగబోయే మహత్తర కార్యం రామ మందిరం ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ.. టాలీవుడ్ నుంచి వీరి ముగ్గురికి భారత ప్రభుత్వం మరియు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఆహ్వానం పంపింది.
దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈరోజు రాత్రికి చిరంజీవి, రామ్ చరణ్ కూడా సతీసమేతంగా ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్ళబోతున్నారు. ఇక అంతటి మహత్తర కార్యక్రమానికి చిరు, చరణ్ వెళ్తుండడంతో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి, అలాగే చిరు, చరణ్కి శుభాకాంక్షలు తెలపడానికి మెగా ఇంటి వద్దకి చేరుకొని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ఇక అభిమానుల రాకతో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు బయటకి వచ్చి ఫ్యాన్స్ ని విష్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ ఆహ్వానం పట్ల చిరు ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. "అంజనా దేవి కుమారుడైన ఆ చిరంజీవే, ఈ భూలోక అంజనాదేవి కుమారుడైన ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
Next Story

