Sun Dec 28 2025 09:24:26 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు మెగా షాక్..!

రాజకీయాలకు దూరమై సినిమాల్లో బిజీ అయిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి కేంద్రమంత్రి పదవిని కూడా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయితే, 2014 తర్వాత ఆయన క్రమంగా కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. పూర్తిగా సినిమాలపై ఆయన దృష్టి పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మళ్లీ పార్టీలో కీలకంగా పనిచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం చిరంజీవిని కోరినా ఆయన సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో చిరంజీవి సభ్యత్వం కాలపరిమితి ముగిసిందని, అయినా ఆయన పునరుద్ధరించుకోలేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే చిరంజీవి కాంగ్రెస్ కు పూర్తిగా దూరమైనట్లే కనపడుతోంది.
Next Story

