Sat Dec 06 2025 00:33:37 GMT+0000 (Coordinated Universal Time)
నిన్న బాలయ్య.. నేడు మెగాస్టార్ చిరంజీవి
అలరించిన తెలుగు ఇండియన్ ఐడల్ మిలియన్ల మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది

ఆహాలో వస్తున్న 'ఇండియన్ ఐడల్ తెలుగు' కు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు క్యూ కడుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు వేళయింది. గ్రాండ్ ఫినాలేను అంతే గ్రాండ్ గా నిర్వహించడానికి మెగా స్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. 15 వారాల పాటు అలరించిన తెలుగు ఇండియన్ ఐడల్ మిలియన్ల మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక ఫినాలే ఒక్కటే బాకీ ఉంది. ఆహా జూన్ 17న రాత్రి 9 గంటలకు ఫైనల్ ప్రీమియర్ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయన సమక్షంలో న్యాయనిర్ణేతలు, పోటీదారులు అద్భుతమైన ప్రదర్శనలను ఇచ్చారు. ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో నిండివుంది. మొదటి ఐదు ఫైనలిస్టులు - జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి మరియు ప్రణతి పవర్-ప్యాక్డ్ ప్రదర్శనలతో గ్రాండ్ ఫినాలేను ఉర్రూతలూగించబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి కూడా వచ్చారు. వారిద్దరూ విరాట పర్వం సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చారు. ఈ శుక్రవారం, 17 జూన్ రాత్రి 9 గంటలకు ఆహాలో మాత్రమే ఈ ఎపిసోడ్ ను చూడవచ్చు.
మరో వైపు బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్రహ్మాస్త్రలో చిరంజీవి కూడా ఒక భాగమయ్యారు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. "డియర్ చిరంజీవి.... మీరెప్పుడూ ఓ మంచి స్నేహితుడిగా, నా కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు కూడా, అడగ్గానే స్పందించి బ్రహ్మాస్త్ర చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తద్వారా ఈ చిత్రానికి మరింత భారీతనం తెచ్చిపెట్టారు. థాంక్యూ" అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్ జూన్ 15న వస్తోందని వెల్లడించారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో వస్తోంది. తొలి భాగాన్ని 'బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ' పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
News Summary - Chiranjeevi Chief Guest at Telugu Indian Idol Finale on Aha
Next Story

