Sun Jun 22 2025 12:34:17 GMT+0000 (Coordinated Universal Time)
అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి
అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు

అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అక్కినేని అఖిల్, జైనబ్ రౌన్జీ రిసెప్షన్ వేడుకలు అన్నపూర్ణ స్టూడియలో వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అఖిల్, జైనబ్ రౌన్జీ దంపతులను ఆశీర్వదించారు. అక్కినేని అఖిల్, జైనబ్ రౌన్జీ ఇటీవల జరిగింది. ఈ వివాహ వేడుకలకు కొందరిని మాత్రమే ఆహ్వానించారు.
ఏపీ, తెలంగాణ నుంచి...
అయితే రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులను అక్కినేని నాగార్జున, అమల స్వయంగా వెళ్లి రావాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జైనబ్ కుటుంబం నాగార్జునకు ఎప్పటి నుంచో సన్నిహితులని, ఇద్దరూ వ్యాపార భాగస్వాములని చెబుతున్నారు.న శనివారం వివాహం జరగ్గా, ఆదివారం రాత్రి వివాహ రిసెప్షన్ ను ఘనంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.
Next Story