Thu Jan 29 2026 18:41:34 GMT+0000 (Coordinated Universal Time)
అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీని కేసీఆర్ ఆదేశించారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్ రామ్ గూడ లోని కృష్ణ నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. రేపు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
మోదీ దిగ్భ్రాంతి...
ప్రధాని నరేంద్ర మోదీ కృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని ఆయన అన్నారు. మానసికంగా బలం చేకూర్చాలని మోదీ భగవతుండిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తక్కువ సమయంలో మహేష్ బాబు ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా ఆయన వెండి తెరను అలరించారన్నారు.
Next Story

