విజయ్ నటన గురించి చరణ్ ఏమన్నాడంటే...?
ప్రస్తుతం టాలీవుడ్ లో సినీ విశ్లేషకులు రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి అడివి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన 'గూఢచారి' సినిమా కాగా ఇంకోటి విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన 'గీత గోవిందం' సినిమా. ఈ రెండు సినిమాలూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయినా 'గీత గోవిందం' గురించి అందరూ సెలెబ్రెటీస్ తమ అభిప్రాయాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సినీ ప్రముఖుల ప్రశంసలు
ఈ సినిమాలో విజయ్ తన నటనలో వైవిధ్యాన్ని చూపాడు. ఎక్కడా 'అర్జున్ రెడ్డి' ఛాయలను కనిపించకుండా నటించేసి.. అందరి మెప్పును పొందుతున్నాడు. ఇప్పటికే విజయ్ నటన గురించి రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రం చూసి స్పందించాడు.
ఒక ట్రీట్ లా ఉంది...
"అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటనలో పర్ఫెక్ట్ గా మారిపోయాడు. ఈ చిత్రంలో విజయ్ - రష్మికల నటన ట్రీట్ లా ఉంది. స్టోరీ.. స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. డైరెక్టర్ పరశురామ్ కి కంగ్రాట్స్. గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్" అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.