Thu Dec 18 2025 23:05:19 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి తారకరత్నకు ప్రముఖుల నివాళి..
హీరోలు వరుణ్ తేజ్, శ్రీ విష్ణు, నాగశౌర్య, నిఖిల్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్..

ప్రముఖ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (39) గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ నేతలు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మంచులక్ష్మి, హీరోలు వరుణ్ తేజ్, శ్రీ విష్ణు, నాగశౌర్య, నిఖిల్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లరి నరేష్, ఎంపీ విజయసాయి రెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్, నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, రేవంత్ రెడ్డి లతో పాటు.. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు.. తదితరులు సోషల్ మీడియా వేదికగా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు,భువనేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి, బాలకృష్ణ, నటుడు అజయ్, పోసాని కృష్ణమురళి, శివాజీ రాజా, మురళీమోహన్, వెంకటేష్, నారా బ్రహ్మణి, పురందేశ్వరి తదితరులు తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించి, భార్య అలేఖ్యను పరామర్శించారు. తారకరత్న భౌతిక కాయాన్ని చూసి ఆయన కుమార్తె బోరున విలపించింది.
Next Story

