Sun Dec 21 2025 09:04:27 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ దర్శకుడికి గుండెపోటు

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు చైన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 63 ఏళ్ల మణిరత్నం తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో అపురూపమైన చిత్రాలను రూపొందించారు. గీతాంజలి, రోజా, బొంబాయి వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం భార్య.
Next Story

