Sat Dec 07 2024 17:02:00 GMT+0000 (Coordinated Universal Time)
NTR Fan: దేవర సినిమా చూసే వరకు బ్రతికితే చాలంటున్న అభిమాని
జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల క్యాన్సర్ రోగి కౌశిక్ తన చివరి కోరికను వ్యక్తం చేశాడు. జూనియర్ కొత్త చిత్రం 'దేవర' చూసేంత వరకూ బతికి ఉండాలని కోరుకుంటున్నాడు. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతను చనిపోయే ముందు దేవర సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు వెల్లడించారు.
తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో కౌశిక్ తల్లి తన కొడుకు చివరి కోరికను పంచుకున్నారు. చిన్నప్పటి నుండి, నా కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని, ఇప్పుడు అతని చివరి కోరిక 'దేవర' సినిమా చూడడం. మా బిడ్డ ఎక్కువ కాలం జీవించడని వైద్యులు మాకు చెప్పారు, కానీ సినిమా చూసే వరకూ జీవించి ఉండటానికి సహాయం చేయమని కోరుతున్నాడని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తల్లిదండ్రులు శ్రీనివాసులు, సరస్వతి అతని కోరికను నెరవేర్చడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. తమ కుమారుడు 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని, ప్రస్తుతం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. చికిత్సకు రూ.60 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ఈ ఖర్చులను భరించేందుకు ప్రభుత్వం, దాతల సహాయాన్ని ఆ కుటుంబం కోరుతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా టాలీవుడ్ మోస్ట్ ఎవైటింగ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది
Next Story