Thu Dec 05 2024 15:36:19 GMT+0000 (Coordinated Universal Time)
RRR కు షాక్.. సినిమాను బ్యాన్ చేయాలంటూ అభిమానుల ఆందోళన
RRR టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో RRR సినిమా విడుదలను బ్యాన్ చేయాలని కన్నడ అభిమానులు..
కర్ణాటక : భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో మరో రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది RRR సినిమా. ఈ నేపథ్యంలో RRR టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో RRR సినిమా విడుదలను బ్యాన్ చేయాలని కన్నడ అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు #BoycottRRRinKarnataka హ్యాష్ట్యగ్ ను ట్రెండ్ చేస్తూ వారి వ్యతిరేకతను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే.. RRRను కర్ణాటకలో అతితక్కువ థియేటర్లలో విడుదల చేయడమే.
తక్కువ థియేటర్లలో RRR ను విడుదల చేయడం.. కన్నడ భాషను అవమానించేలా ఉందని కన్నడ అభిమానులు అంటున్నారు. మరో కారణం.. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ మూవీ ప్రస్తుతం అక్కడ రన్నింగ్ లో ఉంది. RRR కోసం జేమ్స్ మూవీ నడుస్తున్న థియేటర్లను తీసుకోవడంపై పునీత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదల సమయంలోనూ ఇదే వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పుడు అదే సమస్య RRRకు వచ్చింది. ఈ సమస్యను RRR బృందం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Next Story