Mon Dec 08 2025 13:21:48 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ హిట్ డైరెక్టర్ తో తరుణ్ భాస్కర్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది. ఇద్దరు దర్శకులు "ఈ నగరానికి ఏమైంది" "సంజు" చిత్రాల గురించి ముచ్చటించుకున్నారు. తరుణ్ భాస్కర్ తన ఐడియాలను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో షేర్ చేసుకున్నారు.
ఇద్దరూ హిట్ సినిమాలతో
రాజ్ కుమార్ హిరాణి, తరుణ్ భాస్కర్ తీసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. "సంజు" చిత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాక భారీ వసూళ్లను రాబడుతోంది. "ఈ నగరానికి ఏమైంది" సినిమా నలుగురు స్నేహితులు గోవాలో షార్ట్ ఫిలిం చెయ్యడానికి పొందిన అనుభవాలతో తెరకెక్కించబడింది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Next Story

