Fri Mar 20 2026 05:21:31 GMT+0530 (India Standard Time)
బాలివుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి గాయాలు
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదం బారిన పడ్డారు. షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు.

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదం బారిన పడ్డారు. షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా ఆయన గాయపడినట్లు సమాచారం. వెంటనే రోహిత్ శెట్టిని ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
కామినేనికి తరలింపు...
రోహిత్ శెట్టి హైదరాబాద్ శివారులో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చారు. షూటింగ్ చేస్తుండగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే అంత తీవ్ర గాయాలేవీ కావని, ఆయన త్వరగా కోలుకుంటారని సినిమా యూనిట్ చెబుతోంది. వివిధ రకాల పరీక్షలు చేయించేందుకే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కారు ఛేజింగ్ సీన్ లో ఆయన గాయపడినట్లు తెలిసింది
Next Story

