Fri Oct 04 2024 04:43:55 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ నటుడు నితీశ్ పాండే అనుమానాస్పద మృతి
తన బావ ఇక లేరన్న విషయం తెలిసిన తన సోదరి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని చెప్పారు. నితీష్ పాండే పలు సినిమాలతో..
వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో కొందరు, రోడ్డుప్రమాదాల్లో మరికొందరు మృతి చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ పాపులర్ నటుడు నితీశ్ పాండే(50) అనుమానాస్పద స్థితిలో మరణించారు. నాసిక్ సమీపంలోని ఇగత్ పురీలో జరుగుతోన్న ఓ షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన.. అకస్మాత్తుగా హోటల్ లో శవమై కనిపించారు. నితీశ్ పాండే మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే హోటల్ కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నితీశ్ పాండే బస చేసిన హోటల్ సిబ్బంది, ఆయన సన్నిహితులను ప్రశ్నిస్తున్నారు. నితీశ్ గుండెపోటుకు గురై మరణించినట్లు సమాచారం. కానీ.. ఆయన బావమరిది సిద్ధార్థ్ నాగర్.. నితీశ్ కు గుండెసంబంధిత సమస్యలేవీ లేవని చెప్పారు. తన బావ ఇక లేరన్న విషయం తెలిసిన తన సోదరి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని చెప్పారు. నితీష్ పాండే పలు సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ కనిపించారు. 1990లో థియేటర్ నటుడిగా నితీశ్ తన కెరియర్ను ప్రారంభించారు. తేజాస్ అనే టీవీ షోతోపాటు ‘అస్తిత్వ.. ఏక్ ప్రమ్ కహానీ’, ‘మంజిలీన్ అప్నీ అప్నీ’, ‘సాయా’, ‘దుర్గేశ్ నందిని’, ‘జస్టాజూ’ వంటి షోలతో ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజా షో ‘అనుపమ’. అలాగే, బాదాయి దో, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, రంగూన్ వంటి సినిమాల్లో నటించారు. షారూఖ్ ఖాన్ సినిమా ‘ఓం శాంతి ఓం’తోపాటు ‘ఖోల్సా కా ఘోల్సా’ సినిమాల్లో ఆయన నటనకు పేరొచ్చింది.
Next Story