Thu Mar 19 2026 05:27:23 GMT+0530 (India Standard Time)
షూటింగ్లో బిగ్బికి గాయాలు
బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో ఆయన గాయపడ్డారు

బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ అమితాబ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, పక్క టెముకల వద్ద స్వల్ప గాయాలయ్యాయని చెబుతున్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
రెండు వారాల పాటు...
స్వల్ప గాయాలేనని, చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ అయ్యారు. ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్ట్ కే షూటింగ్ లో గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి వెంటనే తరలించారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. చికిత్స పొందిన అనంతరం ఆయన ముంబయికి వెళ్లారు.
Next Story

