Thu Mar 05 2026 09:27:30 GMT+0530 (India Standard Time)
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటిలోనే ఉంచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి

రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటిలోనే ఉంచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన ఇంటి నుంచి రంగారెడ్డి జిల్లాలోని సొంత ఫాం హౌస్ వరకూ అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి లోని ఆయన ఫాం హౌంస్ లో అంత్యక్రియలు జరుగుతాయి. ఐదేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కృష్ణంరాజు కొనుగోలు చేశారు. అక్కడ ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే కన్నుమూశారు.
ఫాంహౌస్ లో....
ఆయన అంత్యక్రియలు అక్కడ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్వహించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫాం హౌస్ వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణంరాజు అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
Next Story

