Mon Mar 16 2026 00:31:36 GMT+0530 (India Standard Time)
నేడు బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్ డిస్నీ హాట్ స్టార్ లో ఆరు వారాలుగా కొనసాగుతుంది. ప్రతి వారం ఒకరు ఎలమినేట్ అవుతూ వస్తున్నారు

తెలుగు బిగ్ బాస్ డిస్నీ హాట్ స్టార్ లో ఆరు వారాలుగా కొనసాగుతుంది. ప్రతి వారం ఒకరు ఎలమినేట్ అవుతూ వస్తున్నారు. ఆరో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఓటీటీలో ప్రారంభమయిన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు కంటెస్టెంట్లు అలవాటు పడిపోయారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపుతారని తెలిసింది.
ఇద్దరు తప్ప.....
అరియానా, ఐషూలు ఇద్దరూ ఈ వారం నామినేట్ కాలేదు. మిగిలిన సభ్యులందరూ నామినేట్ అయ్యారు. అయితే వీరిలో హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ముమైత్ ఖాన్ తో పాటు స్రవంతి కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఈరోజు తేలనుంది.
Next Story

