Sun Feb 01 2026 13:58:11 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ విజేత కన్ఫర్మ్.. లీకులివే
బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగనుంది. ఫైనల్ విజేత ఎవరో నేడు తేలనుంది.

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలే ఈరోజు జరగనుంది. ఫైనల్ విజేత ఎవరో నేడు తేలనుంది. అయితే ఓటింగ్ ప్రకారం సన్నీ తొలి స్థానంలో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్ చివరి దశలో అత్యల్పంగా ఓట్లు రావడంతో మూడో స్థానానికి పరిమితమ యినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి స్థానంలో సన్నీ, రెండో స్థానంలో శ్రీరామచంద్ర, మూడో స్థానంలో షణ్ముఖ్, నాలుగో స్థానంలో మానస్, ఐదో స్థానంలో సిరి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇద్దరి మధ్య....
గ్రాండ్ ఫినాలేకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారంటున్నారు. బాలీవుడ్ నుంచి రణవీర్ కపూర్, దీపికా పడుకోనే ముఖ్యఅతిధులుగా హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. బిగ్ బాస్ విజేతకు యాభై లక్షల క్యాష్ మనీతో పాటు ఒక ఇంటిస్థలాన్ని, ద్విచక్రవాహనాన్ని అందించనున్నారు. రెండో స్థానంలో నిలిచే విజేతకు ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది.
Next Story

