Fri Dec 05 2025 12:41:41 GMT+0000 (Coordinated Universal Time)
Big Boss : బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పటి నుంచి అంటే...? కంటెస్టెంట్లు వీరే
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రేక్షకులకు ముందు రానుంది. దాదాపు వంద రోజులకు పైగా బిగ్ బాస్ సీజన్ 9 బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేయనుంది

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రేక్షకులకు ముందు రానుంది. దాదాపు వంద రోజులకు పైగా బిగ్ బాస్ సీజన్ 9 బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేయనుంది. బిగ్ బాస్ లో కంటెస్ట్ లతో పోటీలు.. వంటలు.. ఎలిమినేషన్, టాస్క్ లతో అందరినీ అలరిస్తుంది. హిందీ బిగ్ బాస్ సూపర్ హిట్ కావడంతో దాదాపు దేశంలో అన్ని భాషల్లో బిగ్ బాస్ ను తీసుకు వస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్ గా అనేక సీజన్ల నుంచి వ్యవహరిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ 9 సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారని అధికారిక ప్రకటన విడుదలయింది.
ప్రమోషన్స్ కూడా మొదలయి...
ఇప్పటికే బిగ్ బాస్ 9 సీజన్ కు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ నెలాఖరులో గాని ఆగస్టు మొదటి వారంలో గాని బిగ్ బాస్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షోకు సంబంధించి అనేక వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేక మందిని కంటెస్టెంట్లను కూడా బిగ్ బాస్ వాళ్లు సెలెక్ట్ చేశారట. వారితో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకుని వారిని వారం రోజులకు ముందుగానే రహస్య ప్రదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
సెట్ కూడా అద్భుతంగా...
ఈసారి బిగ్ బాస్ సెట్ కూడా అద్భుతంగా ఉంటుందని, అన్నపూర్ణ సూడియోలో బిగ్ బాస్ హౌస్ దాదాపు కంప్లీట్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటున్నారు. మూడు నెలల పాటు ఇంటింటా వినోదాన్ని పంచిపెట్టే ఈ బిగ్ బాస్ సీజన్ లో కొత్త టాస్క్ లు, కొత్త నియమాలు కూడా నిర్వాహకులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఎమినేషన్ కు సంబంధించి మరింత విన్నూత్నంగా టెన్షన్ మధ్య కొనసాగేలా తీర్చిదిద్దుతున్నారట. ఇప్పటికే ఈ సీజన్ లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. రీతూ చౌదరి, నవ్య స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతిరాయ్, కల్పికా గణేశ్, తేజస్విని గౌడ, అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు, ఆర్జే రాజు, శ్రావణి వర్మ, సాయికిరణ్, దీపిక, ఈకనాధ్ వంటి వారితో పాటు జబర్దస్త్ టీం నుంచి ఒకరిద్దరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలిసింది. మరి ఈ రియాలిటీ షో ఏ మేరకు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story

