Fri Dec 05 2025 17:47:41 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss : బిగ్ బాస్ 9వ సీజన్ కు డిజైన్ మార్చినట్లుందిగా.. విడుదలయిన ప్రోమో ఏం చెబుతుందంటే?
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అనేక అప్ డేట్స్ బయటకు వచ్చాయి

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉండనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి అనేక అప్ డేట్స్ బయటకు వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ కు మంచి ప్రజాదరణ లభిస్తుంది. మా టీవీలో ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ ను అత్యధిక వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది. అయితే బిగ్ బాస్ 9 సీజన్ సెప్టంబరు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇక కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింది.
సామాన్యులకు స్థానం...
అయితే ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు ఆర్డినరీ పీపుల్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే 9వ సీజన్ లో ఐదుగురు సామాన్యలు ఎంట్రీ ఇస్తారంటున్నారు. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రీ షో ప్రసారం కానుంది. ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రసారం కానున్న ఈ షోలో కూడా సామాన్యులు పాల్గొననున్నారు. దాదాపు నలభై మంది సామాన్యులు కూడా పాల్గొంటున్నారని చెబుతన్నారు. వీరిలో ఐదు మందిని ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ కు పంపుతారన్న టాక్ వినపడుతుంది.
ప్రీ షోలో...
అయితే స్టార్ మా లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమోలో దాదాపు నలభై మంది కంటెస్టెంట్లు పాల్గొని సందడి చేసినట్లు కనపడుతుంది. ఈ ప్రీషోకు అగ్ని పరీక్ష అని పేరు పెట్టారు. ఈ షో ద్వారా బిగ్ బాస్ షోకు మరింత హైప్ తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఈసారి ముందుగానే ప్రీ షో పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టంబరు 5వ తేదీ నుంచి ఇక బిగ్ బాస్ 9వ సీజన్ బుల్లితెరపై సందడి చేయనుంది. దాదాపు మూడు నెలలకు పైగానే అంటే వందరోజులు సాగే ఈ సుదీర్ఘ షో ను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోతున్నారు. కంటెస్టెంట్ల మధ్య తిట్లు, కొట్లాటలు, గేమ్స్, ఎలిమినేషన్ ప్రక్రియ వంటివి ఈసారి ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేశారని చెబుతున్నారు.
Next Story

