Sun Oct 13 2024 19:54:23 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ డే 1 : గొడవలు మొదలు.. ఇద్దరి మధ్య జుట్టు పంచాయతీ
ఇంటిలో ఎవరి పనివాళ్లు చేయాలన్న రూల్ ఉన్నా..వేరే వాళ్ల వెంట్రుకలు మాత్రం నేను తీయను అని అరిచింది గీతూ.
సెప్టెంబర్ 4, ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సీజన్ లో ఒక కపుల్ తో కలిపి మొత్తం.. 21మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి వచ్చిన కంటెస్టంట్స్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో హడావిడి మొదలైపోయింది. మొదటిరోజే ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టేశాడు బిగ్ బాస్. తొలిరోజు ఉదయం గార్డెన్ లో కంటెస్టంట్లంతా కలిసి డ్యాన్సులు చేశారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. గీతు - ఇనయ సుల్తానా మధ్య జుట్టుపంచాయతీ నడిచింది. బాత్రూమ్ లో ఎవరివో వెంట్రుకలు పడ్డాయని గీతూ రాయల్ హాల్లోకి వచ్చి అందరిముందు అరిచింది.
ఇంటిలో ఎవరి పనివాళ్లు చేయాలన్న రూల్ ఉన్నా..వేరే వాళ్ల వెంట్రుకలు మాత్రం నేను తీయను అని అరిచింది గీతూ. ఇంతలో వెనుక నుంచి ఒక కంటెస్టంట్ ఆ వెంట్రుకలు ఇనయ సుల్తానావి అని చెప్పడంతో ఆమె పై ఫైర్ అయింది. ఇద్దరూ పోటాపోటీగా అరుచుకుంటుంటే.. మిగతా ఇంటి సభ్యులంతా సైలెంట్ గా చూస్తుండిపోయారు. అనంతరం.. బిగ్ బాస్ పంపిన ఫైల్ లో ఉన్న మ్యాటర్ ని ఫైమా చదివి అందరికీ వినిపించింది. ఇందులో హౌజ్లోని సభ్యులను క్లాస్, ట్రాష్, మాస్ అంటూ భాగాలుగా విడిపోవాలి. ఎవరు క్లాస్, ఎవరు ట్రాష్, మాస్ అనేది వాళ్లే తేల్చుకోవాలి.
క్లాస్ గ్రూప్ లో సభ్యులు అన్ని సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్ వాళ్లు బయట గార్డెన్ ఏరియాలో వంట చేసుకోవాలని టాస్క్ ఇచ్చారు. దాంతో అందరూ గ్రూపులుగా విడిపోయారు. అనంతరం ఇద్దరు కంటెస్టెంట్లు కొబ్బరి బోండాలోని నీళ్లు కింద పడకుండా ఒకరినొకరు కొట్టుకోవాలని టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బోండంలో ఎక్కువ నీళ్లు ఉంటాయో వాళ్లే విన్నర్ అని చెప్పారు. ఈ గేమ్ ఇనయ, ఆదిరెడ్డి ఆడగా.. ఆదిరెడ్డి విన్నర్ అయ్యారు. అలా తొలిరోజు నుంచే హౌస్ లో టాస్క్ లు ఫుల్ హీట్ తో మొదలయ్యాయి.
Next Story