బిగ్ బాస్ గందరగోళం!!
బిగ్ బాస్ వన్, టు, త్రి సీజన్స్ కాంట్రవర్సీలు జరిగినా మా టివి కి మాంచి టిఆర్పి రేటింగ్ తెచ్చిపెట్టాయి. దానితో సీజన్ 4 మీద మంచి [more]
బిగ్ బాస్ వన్, టు, త్రి సీజన్స్ కాంట్రవర్సీలు జరిగినా మా టివి కి మాంచి టిఆర్పి రేటింగ్ తెచ్చిపెట్టాయి. దానితో సీజన్ 4 మీద మంచి [more]
బిగ్ బాస్ వన్, టు, త్రి సీజన్స్ కాంట్రవర్సీలు జరిగినా మా టివి కి మాంచి టిఆర్పి రేటింగ్ తెచ్చిపెట్టాయి. దానితో సీజన్ 4 మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున పేరు ఎక్కువగా వినబడుతుండగా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ పేర్లు ఒకొక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అసలు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వినబడుతుంది. అయితే సీజన్ 4 కి కాస్త క్రేజీ కంటెస్టెండ్ నేమ్స్ బయటికొచ్చాయి.
అనసూయ కి భారీ ఆఫర్ ఇవ్వగా.. అనసూయ నో చెప్పడం, యాంకర్ జాన్సీని ఎప్పటిలాగే అంటే మొదటి షో నుండి ఆమెని సంప్రదిస్తుంటే… సీజన్ 4 ని కూడా ఆమె రిజెక్ట్ చెయ్యడం, ఇక తాజాగా జానపద గీతాలతో పాపులర్ అవుతున్న సింగర్ మంగ్లీ, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న తరుణ్ ఇందులో ఒక పార్టిసిపేంట్ గా ప్రత్యేక ఆకర్షణ కానున్నాడని, అలాగే టీవీ యాంకర్లు వర్షిణి తో పాటుగా జాహ్నవి తదితరులతో బిగ్ బాస్ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఫైనల్ లిస్ట్ అవస్తుంది అని అంటున్నారు. కరోనా లాక్ డౌన్ ముగిసిన ఓ నెల రోజులనుండి బిగ్ బాస్ సీజన్ 4 బుల్లి తేరా మీదకి రానున్నట్లుగా తెలుస్తుంది.
- Tags
- big boss 4