Sat May 24 2025 13:22:43 GMT+0000 (Coordinated Universal Time)
SSMB 29 : మహేశ్ బాబుకు ఇక తిరుగుండదా? రికార్డులు బద్దలు కొట్టేస్తాడా?
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB 29కి సంబంధించి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB 29కి సంబంధించి తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా మీద ఇప్పటికే ఎంతో హైప్ క్రియేట్ అయింది. ఏ రేంజ్ లో అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకూ ఉన్న అన్ని సినిమాల రికార్డులను ఇది బద్దలు కొట్టడం ఖాయమని సీనీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. పుష్ప 1, పుష్ప 2 రేంజ్ కు మించి SSMB 29 ని రాజమౌళి సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రతి ఫ్రేమును జాగ్రత్తగా చూస్తూ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాజమౌళి ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అందుకే దీనికి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా అది ఫ్యాన్స్ కు తీపికబురేనని చెప్పాలి.
ఫైట్స్ యాక్షన్స్...
SSMB 29 చిత్రంలో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటిస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. వీరు ముగ్గురు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారన్న సమాచారం కూడా ఇండ్రస్ట్రీలో జోరుగా నడుస్తుంది. ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమయింది. మహేశ్ బాబు కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రం యాక్షన్ సీన్లు త్వరలోనే షూట్ చేయడానికి దర్శకుండు రాజమౌళి సిద్ధం చేశాడట. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు వేల మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారని కూడా వార్త వైరల్ అవుతుంది. ఈ షూటింగ్ ఒక బోటులో జరుగుతుందని, దీనికి సంబంధించి షూటింగ్ కోసం చిత్ర బృందం అంతా రెడీ చేసినట్లు తెలిసింది.
తెరమీదే చూడాలి...
ఈ యాక్షన్ సీన్స్ లో మహేశ్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారని, ఇందుకోసం హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ఇప్పటికే యాక్షన్ సీన్స్ ను క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని హంగులు సమకూరుస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి తిరిగి వచ్చే ఒక సాహసికుడి పాత్రలో మహేశ్ బాబు కనిపించబోతున్నట్లు అర్థమవుతుందంటున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇక SSMB 29 ఎలా ఉంటుందన్నది తెర మీద చూస్తే తప్ప ఆ కిక్కు వేరేలా ఉండదు.
Next Story