Sat Jul 12 2025 22:15:20 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఓజీ.. ఓజీ.. వచ్చేస్తుందోచ్... ఇక ఊగిపోండి ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ గురించి బిగ్ అప్ డేట్ ఒకటి వైరల్ గా మారింది

పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలని ఎక్కువ మందిఆశపడుతుతుంటారు. అందుకే ఆయన రాజకీయ సభలు పెట్టినా, ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా సీఎం.. సీఎం అంటూ నినాదాలతో పాటు మరో నినాదం కూడా జోరుగా వినిపిస్తుంది. అదే ఓజీ.. ఓజీ అంటూ ఫ్యాన్స్ కేకలు పెడుతుంటారు. ఆ నినాదాలు విన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలు కాదు అంటూ సర్దిచెప్పడం పరిపాటిగా మారింది.
ఎక్కడకు వెళ్లినా...?
అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ గురించి బిగ్ అప్ డేట్ ఒకటి వైరల్ గా మారింది. ఈ మూవీని సెప్టంబరు 5వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. ఓజీ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో నిరంతరం బిజీగా ఉండటంతో అస్సలు రిలీజ్ డేట్ తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. హరిహరవీరమల్లు కూడా రిలీజ్ డేట్ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు.
రిలీజ్ డేట్ కోసం...
ఓజీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ కూడా డైరెక్టర్, నిర్మాతలకు సెప్టంబరు 5వ తేదీన మూవీని రిలీజ్ చేయాలని సూచించారన్న వార్త వైరల్ గా మారింది. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో డైరెక్టర్ సుజిత్ కేవలం పోస్టు ప్రొడక్షన్ పనిలో ఉన్నారని చెబుతున్నారు. యాక్షన్ డ్రామా చిత్రం కావడంతో ఓజీ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మే నెలలో హరిహరవీరమిల్లు రిలీజ్ చేయాలని, సెప్టంబరులో ఓజీ విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఉన్నారు. ఓజీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టంబరు 5వ తేదీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Next Story