Wed Dec 24 2025 03:36:35 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియా ప్రకాశ్ కు భారీ ఊరట

ఓ పాటలో కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన మళయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కు సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. ప్రియా నటించిన ‘ఓరు అదార్ లవ్’ సినిమాలో ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఇందులోని ‘మాణిక్య మలరయ’ పాట సంప్రదాయ ముస్లిం గీతమని, ఈ సినిమాను నిలివేయాలని కోరుతూ హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందినవారు ప్రియా ప్రకాశ్ తో పాటు చిత్ర హీరో, దర్శకుడు, నిర్మాతలపై కేసులు వేశారు. ఈ కేసులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా... ‘ ఏదో సినిమాలో ఏదో పాట ఉంటే... మీకు కేసులు వేయడం తప్ప వేరే పని లేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు కొట్టవేయడంతో ఈ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
Next Story

