లీకుల రాజా… బిగ్ బాస్!!
తెలుగులో బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైనప్పుడు.. ఆ సెట్ ని పూణే లో వెయ్యడంతో.. అక్కడినుండి ఒక్క లీకు కూడా బయటికి వచ్చేది కాదు. [more]
తెలుగులో బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైనప్పుడు.. ఆ సెట్ ని పూణే లో వెయ్యడంతో.. అక్కడినుండి ఒక్క లీకు కూడా బయటికి వచ్చేది కాదు. [more]
తెలుగులో బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైనప్పుడు.. ఆ సెట్ ని పూణే లో వెయ్యడంతో.. అక్కడినుండి ఒక్క లీకు కూడా బయటికి వచ్చేది కాదు. కానీ సెకండ్ సీజన్ వచ్చేసరికి బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వెయ్యడంతో.. లీకుల పర్వం మొదలైంది. మూడో సీజన్ లోను బిగ్ బాస్ లీకులు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి వెళ్లే వాళ్లలో కొందరి పేర్లు ఎప్పుడో సోషల్ మీడియా కెక్కాయి. కానీ అందులో నిజ నిజాలు ఎవరికీ తెలియవు. కానీ తాజాగా కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయ్యిందట.
వాళ్ళకి కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారట. ఓ 14 రోజులు హోమ్ క్వారంటైన్ లోనే ఉండి.. తర్వాత మళ్ళీ టెస్ట్ లు చేయించాక బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారట నిర్వాహకులు. అయితే ఆ ఫైనల్ లిస్ట్ లో కొరియోగ్రాఫేర్, మెగా మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. గత సీజన్ లో బాబా భాస్కర్ మాస్టర్ ఎంటెర్టై చెయ్యగా.. ఆయన వలన బిగ్ బాస్ కి బాగా క్రేజ్ వచ్చింది. ఈసారి జానీ మాస్టర్ని ని తీసుకొచ్చారట అంటున్నారు. ప్రస్తుతం ఎలాగూ షూటింగ్స్ లేవు..అందుకే బిగ్ బాస్ వారు పిలవగానే జానీ మాస్టర్ ఆ షో కి ఓకె చెప్పసాడనే టాక్ నడుస్తుంది. యాక్టర్ కమ్ సింగర్ నోయెల్ కూడా ఈ సీజన్లో తన హుషారయిన సాంగ్స్ తో హోరెత్తించబోతున్నాడట. మరి తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ ప్రోమో లో నాగార్జున మూడు తరాల గెటప్స్ లో బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూ అందరిలో ఆసక్తి నింపాడు.