Thu Mar 26 2026 04:07:46 GMT+0530 (India Standard Time)
బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పిన బాబు గోగినేని

బిగ్ బాస్ సీజన్-2లో గత ఆదివారం బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. ఆయన హౌజ్ లో ఉన్నప్పుడు కౌశల్ ను బాగా వ్యతిరేకించారు. అయితే, ఇప్పుడు ఆ కౌశలే బిగ్ బాస్ గెలిచే అవకాశం ఉందని బాబు అంటున్నారు. తాను కౌశల్ ను టార్గెట్ చేయలేదని, కేవలం ఆయన వైఖరి పట్ల నిరసన మాత్రమే వ్యక్తం చేశానని చెప్పారు. కౌశల్ కు హౌజ్ లో, బయట కూడా బాగా సపోర్ట్ ఉందని, ఓటింగ్ సరళి చూస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కౌషల్ ఫైనలిస్టుగా ఉంటాడని ముందుగానే ఊహించానని, తాను ఫైనలిస్టునని మాత్రం అనుకోలేదన్నారు. కాబట్టి, కౌశల్ కు తాను పోటీగా భావించలేదన్నారు. కౌశల్ బిగ్ బాస్ గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Next Story

