ఈ టైం లో బిగ్ బాస్ కి ఇంత నెగిటివిటి అవసరమా?
బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలవడం.. ఓపెనింగ్ ఎపిసోడ్ కి భారీ టీఆర్పీ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఉత్సాహం తో [more]
బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలవడం.. ఓపెనింగ్ ఎపిసోడ్ కి భారీ టీఆర్పీ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఉత్సాహం తో [more]
బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలవడం.. ఓపెనింగ్ ఎపిసోడ్ కి భారీ టీఆర్పీ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యం ఉత్సాహం తో ఉంది. అయితే హౌస్ లో పేరున్న కంటెస్టెంట్స్ లేకపోవడంతో షో నీరసంగా సాగుతుండడంతో.. భారీ పారితోషకానికి జబర్దస్త్ అవినాష్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించారు. వీక్ డేస్ లో వీక్ గా ఉన్న బిగ్ బాస్ పై ఇప్పుడు బయట నెగెటివిటి మొదలయ్యింది. మామూలుగానే బిగ్ బాస్ కి వెళ్లోచ్చినవాళ్ళు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతుంటారు అది వేరే విషయం. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ వితిక సేరు.. హౌస్ లో జరిగేది వేరు.. వాళ్ళు బయటికి ప్రాజెక్ట్ చేసేది వేరని.. దానివలన మా పర్సనల్ లైఫ్ పాడవుతుంది అని… మా మీద వచ్చే నెగెటివ్ ట్రోల్ల్స్, మీమ్స్ వలన మా ఫామిలీస్ బాధపడుతున్నాయని, బిగ్ బాస్ లో 24 గంటలు ఉంటే.. ఓ గంట మాత్రమే బిగ్ బాస్ చూపిస్తుంది అని.. దానివలన మా మీద బయట జనాల్లో నెగెటివిటి పెరుగుతుంది అని ఓ వీడియో షేర్ చేసింది.
అయితే వితిక వీడియో చూసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివ జ్యోతి వితిక ని సపోర్ట్ చేసింది. నిజంగానే బిగ్ బాస్ లో జరిగేది ఎవరికీ తెలియదని.. కాంట్రవర్సీలని మాత్రమే బిగ్ బాస్ లో చూపిస్తారని.. నేను బయటికి వచ్చాక బిగ్ బాస్ చూడలేదని, కారణం నెగెటివ్ ట్రోల్స్ భరించలేక కాదని.. నాకు ఇంట్రెస్ట్ లేదని.. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో సరిగ్గా ప్రోజెక్ట్ చెయ్యడం లేదని.. అక్కడ మమ్మల్ని చూసి మా మీద ట్రోల్స్ చెయ్యడం బాగోలేదని.. వితిక చెప్పింది కరెక్ట్. నేను వితిక చాలామంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్ లో మేమిద్దరం చాల విషయాలు మాట్లాడుకున్నాము.. అది చూపియ్యని బిగ్ బాస్ మేము శత్రువులమని చూపించాడంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యింది. ఇక వితిక ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం నచ్చింది అని.. నువ్వు ఎన్నో విషయాల్లో పోరాడి గెలిచావ్.. దీనిలోనూ నీదే గెలుపు అంటూ వితికాని విష్ చేసింది శివ జ్యోతి. మరి బిగ్ బాస్ సీజన్ 4 అసలే నీరసంగా నడుస్తున్న టైమ్ లో ఇలాంటి నెగెటివిటి ప్రచారం కావడం షో పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు.