Fri Aug 12 2022 06:37:47 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే ఇంట తీవ్ర విషాదం

బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి మరణించారు. తన తల్లి గత నెలలో చనిపోయిందని చెప్పుకొచ్చాడు. జూలై 5వ తేదీ చోటు చేసుకున్న ఘటన తన జీవితాన్ని మార్చిందని తెలిపాడు. తన తల్లి మృతిపై ఎమోషనల్ అవుతూ.. ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. మెహబూబ్ తల్లి హార్ట్ అటాక్ తో మరణించారు.
అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?.. నేను ప్రతీ రోజూ ఎవరితో మాట్లాడాలి? అంటూ ఎమోషనల్ అయ్యాడు మెహబూబ్. నువ్ లేకపోతే ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.. నువ్ నన్ను ఎప్పుడూ కూడా ఏ దానికి కూడా అడ్డు పడలేదు.. నా ఎదుగుదలను చూస్తూ మురిసిపోయావ్ అమ్మా.. నా గెలుపోటముల్లో నువ్ అండగా ఉన్నావ్ అమ్మా అని చెప్పుకొచ్చాడు మెహబూబ్. మా గురించి నువ్ నీ జీవితంతో పోరాడావ్.. ఎవ్వరూ చేయలేని విధంగా నువ్ మాకోసం చేశావ్.. మా కోసం అన్నీ త్యాగం చేశావ్ అని సుదీర్ఘమైన పోస్టులో చెప్పుకొచ్చాడు మెహబూబ్.
Next Story