తల పట్టుకుంటున్న బిగ్ బాస్ యాజమాన్యం!!
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ మా ప్రారంభం కాబోతుంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కోసం బిగ్ [more]
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ మా ప్రారంభం కాబోతుంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కోసం బిగ్ [more]
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ మా ప్రారంభం కాబోతుంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కోసం బిగ్ బాస్ యాజమాన్యం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ పరిచయాలతో షో ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్న టైం లో బిగ్ బాస్ యాజమాన్యం కరోనా వలన తల పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే కరోనా కారణంగా షో నెల రోజుల లేట్ గా మొదలవుతుంది అనుకుంటే.. ఇప్పుడు షోలోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కరోనా బారిన పడడం బిగ్ బాస్ యాజమాన్యాన్ని కలవర పెడుతుంది.
మొన్నటికి మొన్న బిగ్ బాస్ హౌసెమెట్స్ కి కరోనా టెస్ట్ లు చేయించి హోమ్ క్వారంటైన్ కి పంపితే.. అందులో ఓ సింగర్ కరోనా పాజిటివ్ అని తెలగా.. ఇప్పుడు మరి ఇద్దరు కంటెస్టెంట్స్ కి కరోనా పాజిటివ్ రావడంతో…. వాళ్ళ ప్లేస్ లోకి మరి కొందరిని తీసుకుందామన్నా మల్లి కరోనా టెస్ట్ చెయ్యాలి.. వాళ్ళని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచాలి.. తర్వాతగానీ హౌస్ కి పంపలేరు. మరి మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోయే షో కి ఇలాంటి ఆటంకాల వలన షో సక్సెస్ ఫుల్ గా మొదలు పెడతారో లేదో అనే డౌట్ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ మొదలయ్యింది. బిగ్ బాస్ సీజన్ 4 కోసం యూట్యూబ్ సంచలనం గంగవ్వని కూడా ఎంపిక చేసారని, ఇప్పుడు కరోనా బారిన పడింది గంగావవే అంటూ ప్రచారం మొదలైంది. మరి ఎవరికీ పాజిటివ్ వచ్చిందో అనేది కేవలం ఊహాగానాలే కానీ.. పక్కా క్లారిటీ లేదు.
- Tags
- big boss 4