Wed Dec 17 2025 06:46:26 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ కన్నా తక్కువే

బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 2 ఎన్టీఆర్ హోస్ట్ గా తప్పుకోవడంతో ఆ బాధ్యతలు నానిపై పెట్టారు టీం. సీజన్ 2 చేసేందుకు నాని ఫిక్సయిపోయాడు. బిగ్ బాస్ షో అంటే రెమ్యూనిరేషన్ కాస్త భారీగానే వుంటుంది. సీజన్ 1 కు ఎన్టీఆర్ కు 9 కోట్లు వరకు ఇచ్చారు. మరి ఇప్పుడు హీరో నానికి ఎంత ఇస్తారు?
సాధారణంగా హీరో నాని తన సినిమాలకు ఏడు నుండి తొమ్మిది కోట్లు వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. అయితే బిగ్ బాస్ షో కోసం నాని దాదాపు మూడున్నర కోట్లు రెమ్యూనిరేషన్ కు ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.
వారానికి రెండు రోజులు మాత్రమే ఈ షోను షూట్ చేస్తారు. అంటే మొత్తం మీద చూసుకున్నా గట్టిగా నెల రోజులు వర్క్ వుండదు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు అంటే ఇదేనేమో! అయితే సీజన్ 2 కు ఆర్టిస్ట్స్ ఎవరో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియాలిసుంది.
Next Story
