Fri Dec 05 2025 13:58:27 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్.. ఎప్పుడంటే..?
"నాయక్ .. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అని రానా చెప్పిన డైలాగ్.. ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ట్రైలర్ ఓకే.. మరి ప్రీ రిలీజ్ సంగతేంటి ?

పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ నెల 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు భీమ్లా నాయక్. ఫిబ్రవరి 21న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సింది. కానీ.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో.. ప్రీ రిలీజ్ వేడుకను ఆపివేశారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటనలు కూడా చేశారు. ఇక ముందుగా చెప్పినట్లే.. ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా.. నిన్న సాయంత్రమే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై హైప్ ను పెంచేశాయి.
Also Read : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయంవిద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
"నాయక్ .. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అని రానా చెప్పిన డైలాగ్.. ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ట్రైలర్ ఓకే.. మరి ప్రీ రిలీజ్ సంగతేంటి ? ఇప్పుడిదే అభిమానుల్లో తలెత్తుతోన్న ప్రశ్న. సినిమా విడుదలకు ఇంకా మూడ్రోజులే సమయం ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో చెప్పండంటూ అభిమానులు నెట్టింట ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ సెట్ వేశారు. అనుకున్న సమయానికి ఈవెంట్ జరిగి ఉంటే.. మంత్రులు కేటీఆర్, తలసాని చీఫ్ గెస్ట్ లుగా వచ్చేవారు. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23, బుధవారం సాయంత్రం జరుగుతుందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తే గానీ.. ఒక స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
News Summary - Bheemla Nayak Pre Release Event
Next Story

