Sat Apr 01 2023 22:59:15 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్.. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే !
టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భీమ్లా నాయక్.. హిందీ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు తెలుగు ట్రైలర్..

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. తెలుగులో విడుదలై అప్పుడే వారంరోజులు అయింది. ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ లోనూ ఊహించని వసూళ్లు రాబట్టింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ ను.. మొదట తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కానీ.. టెక్నికల్ కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాస్త వాయిదా పడింది.
Also Read : ఓటీటీలో విడుదలైన డీజే టిల్లు
టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భీమ్లా నాయక్.. హిందీ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు తెలుగు ట్రైలర్ లాగానే ఉన్నా.. కొన్ని సన్నివేశాలను మార్చి ట్రైలర్ ను వదిలారు. పవన్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ను షేర్ చేస్తూ.. ఇక బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలైన పుష్ప.. అక్కడ ఎవ్వరూ ఊహించని రీతిలో రూ.100 కోట్ల వసూళ్లు చేసింది. భీమ్లా నాయక్ కూడా బాలీవుడ్ ను షేక్ చేస్తుందంటున్నారు సినీ అభిమానులు.
News Summary - Bheemla Nayak Hindi Trailer Out Now
Next Story