Sun Mar 22 2026 03:37:13 GMT+0530 (India Standard Time)
భరత్ ఐదు రోజుల లెక్కలు

కొరటాల శివ - మహేష్ బాబు కలయికలో వచ్చిన భరత్ అనే నేను భారీ రికార్డులు సృష్టించే దిశగా పరుగులు పెడుతుంది. వీకెండ్ లో సూపర్ కలెక్షన్స్ కొట్టిన భరత్ వీక్ డేస్ లోను మల్టీ ప్లెక్స్ లో నిలకడగా కలెక్షన్స్ రాబడుతుంది. బిసి సెంటర్స్ లో భరత్ హావ కాస్త తగ్గినా కలెక్షన్స్ మాత్రం పర్లేదనిపిస్తన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహేష్ మూవీ ఓవర్సీస్ లోను అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చేలాగే కనబడుతుంది. ప్రస్తుతం ఐదు రోజులు పూర్తి చేసుకున్న భరత్ అనే నేను రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 45.93 కోట్లు గా ఉన్నాయి.
ఏరియా: షేర్స్ కోట్లలో
నైజాం: 12.67
సీడెడ్: 6.78
నెల్లూరు: 1.74
కృష్ణా: 4.16
గుంటూరు: 6.38
వైజాగ్: 6.02
ఈస్ట్ గోదావరి: 5.11
వెస్ట్ గోదావరి: 3.07
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ కోట్లలో: 45.93
Next Story

