Tue Dec 30 2025 05:10:49 GMT+0000 (Coordinated Universal Time)
కవచంతో వస్తున్న బెల్లంకొండ

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ కవచం. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ దసపల్లా హోటల్ లో జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా 'కవచం' టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ చోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు తమన్, చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల, కళా దర్శకుడు చిన్న, ఎడిటర్ చోట కె. ప్రసాద్, రచయిత కేశవ్ పప్పల, చీఫ్ కో- డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి, సహ నిర్మాత చాగంటి శాంతయ్య పాల్గొన్నారు.
Next Story

