Sun Mar 22 2026 20:41:24 GMT+0530 (India Standard Time)
శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత

సీనీనటి శ్రీరెడ్డి పై మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ నిషేధాన్ని ఎత్తివేసింది. సీనియర్ నటుల సూచనల మేరకు శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మా ప్రకటించింది. ఇటీవల శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేయడం, పలువురిపై ఆరోపణలు చేయడంతో ఆమెపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారడంతో మా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినీ పరిశ్రమలో అవకాశాలు మా చేతులో లేదని, దర్శక, నిర్మాతలే అవకాశమిస్తారని మా అసోసియేషన్ తెలిపింది. సినీ పరిశ్రమలో మహిళల లైంగిక వేదింపుల అరికట్టడానికి కమిటీ అగినెస్ట్ సెక్సువల్ అరాస్ మెంట్ (క్యాష్) ను ఏర్పాటు చేసింది. అయితే తనపై నిషేధాన్ని తొలగించినా పోరాటం ఆపేదిలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.
Next Story

