Tue Mar 17 2026 10:31:00 GMT+0530 (India Standard Time)
బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి అనుకోని అతిథిగా వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించడంలో బిజీగా ఉన్న బాలయ్య, సినిమాలో పాత్రలకు నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ని ఎంపిక చేశారు. అయితే, ఈ ఆఫర్ కు ఆమె ఇంకా జవాబు చెప్పలేదు. అయితే, ఇంతలో ముంబై వెళ్లిన బాలయ్య పనిలో పనిగా విద్యాబాలన్ ఇంటికి వెళ్లారు. తన తండ్రి బయోపిక్ లో నటించాలని బాలయ్యే స్వయంగా ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. దీంతో మొత్తానికి ఓ ముఖ్య పాత్రకు నటి దొరికేసినట్లే అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
Next Story

