బాలకృష్ణ కాదంటే వెంకటేష్ దగ్గరకు..!
ఒకప్పుడు వి.వి.వినాయక్ వేరు ఇప్పుడు వి.వి.వినాయక్ వేరు అన్నట్టు మారిపోయింది ఆయన పరిస్థితి. ఒకప్పుడు వరస విజయాలతో దూసుకుపోయిన వినాయక్ గత కొంత కాలం నుండి డిజాస్టర్స్ [more]
ఒకప్పుడు వి.వి.వినాయక్ వేరు ఇప్పుడు వి.వి.వినాయక్ వేరు అన్నట్టు మారిపోయింది ఆయన పరిస్థితి. ఒకప్పుడు వరస విజయాలతో దూసుకుపోయిన వినాయక్ గత కొంత కాలం నుండి డిజాస్టర్స్ [more]
![vv vinayak film with venkatesh vv vinayak film with venkatesh](https://www.telugupost.com/h-upload/old_images/1187476-vv-vinayak.webp)
ఒకప్పుడు వి.వి.వినాయక్ వేరు ఇప్పుడు వి.వి.వినాయక్ వేరు అన్నట్టు మారిపోయింది ఆయన పరిస్థితి. ఒకప్పుడు వరస విజయాలతో దూసుకుపోయిన వినాయక్ గత కొంత కాలం నుండి డిజాస్టర్స్ చవి చూస్తున్నాడు. గత ఏడాది సాయి ధరమ్ తేజ్ తో “ఇంటెలిజెంట్” అనే సినిమాతో మన ముందుకు వచ్చి ఘోరమైన ఫ్లాప్ ని చవిచూసాడు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న వినాయక్ ను పిలిచి బాలకృష్ణ ఆఫర్ ఇచ్చాడు. వినాయక్ త్వరగా సినిమా స్టార్ట్ చేయడం కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని ఉన్నాడు.
వెంకటేష్ అవకాశం ఇస్తాడా..?
అయితే రీసెంట్ గా బాలకృష్ణ బోయపాటిని లైన్ లోకి తీసుకొచ్చి వీరి కాంబినేషన్ లో సినిమా ను అనౌన్స్ చేసాడు. దీంతో వినాయక్ ఆ కథతో హీరో వెంకటేష్ ని కలిసాడని ఫిలింనగర్ టాక్. వెంకీ కూడా కథ విని ఓకే చెప్పాడని సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో “లక్ష్మి” అనే పవర్ ఫుల్ సినిమా వచ్చింది. ఇది వెంకీ కెరీర్ లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. మరి వరస ఫ్లాప్స్ తో ఉన్న వినాయక్ కి వెంకటేష్ అవకాశం ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.