Tue Mar 17 2026 11:00:28 GMT+0530 (India Standard Time)
'బాహుబలి' ని బీట్ చేయడం అంత ఈజీ కాదు..!

శంకర్ - రజినీ కాంబినేషన్లోని 2.ఓ చిత్రం 'బాహుబలి' ని కచ్చితంగా బీట్ చేస్తుందనే ధీమాతో ఉన్నారు అంతా. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూసింది. కానీ అనుకున్న స్థాయిలో అయితే ఈ చిత్రాన్ని ఆదరించడం లేదు అనే చెప్పాలి. ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాల ప్రకారం ఇప్పుటివరకు వచ్చిన వసూళ్లు తక్కువే అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే ఇంకా చాలా వరకు రాబట్టాల్సి ఉందట. పైగా రేపటి నుండి తెలుగులో కొత్త సినిమాల హావా నడవనుంది. వీటి ప్రభావం కచ్చితంగా 2.0 కలెక్షన్స్ పై పడుతుంది. తమిళంలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ చిత్రం ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో చూడాలి. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం అయిపోతుంది.
Next Story

