బాబుకి పనికల్పించిన బాలయ్య!!
టాలీవుడ్ లో స్టార్స్ మధ్యన ఇప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సినిమా పెద్దలంతా ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు అన్నట్టుగా బాలకృష్ణ నిన్న ఎన్టీఆర్ జయంతి నాడు [more]
టాలీవుడ్ లో స్టార్స్ మధ్యన ఇప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సినిమా పెద్దలంతా ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు అన్నట్టుగా బాలకృష్ణ నిన్న ఎన్టీఆర్ జయంతి నాడు [more]
టాలీవుడ్ లో స్టార్స్ మధ్యన ఇప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సినిమా పెద్దలంతా ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు అన్నట్టుగా బాలకృష్ణ నిన్న ఎన్టీఆర్ జయంతి నాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కాక పుట్టిస్తున్నాయి. బాలకృష్ణ చిరు బృందాన్ని ఉద్దేశించి ప్రభుత్వంతో పెద్దలు ఏం మాట్లాడుతున్నారో.. మీడియా ద్వారా తెలుసుకుంటున్నా అంటూ చిచ్చు రేపాడు. మీడియాలో వార్తలు చూసిన తర్వాతే నేను సినీ పెద్దలతో ప్రభుత్వ మీటింగ్ గురించి తెలుసుకున్నాను. ఆ సమావేశానికి నన్ను ఎవరూ పిలవలేదు. అలాగే బసవతారకం హాస్పిటల్ లో బాలయ్య బ్లడ్ డొనేషన్ కి వెళ్లి అక్కడ కూడా హైదరాబాద్ భూములను తమలో తాము పంపిణీ చేయడం గురించి మంత్రి తలసానితో వారు చర్చించి ఉండవచ్చు. వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. అంటూ హాట్ హాట్ గా మాట్లాడాడు.
బాలయ్య అలా మట్లాడడంతో నిర్మాత సి కళ్యాణ్ బాలయ్యని ఎవరూ పిలవక్కర్లేదు. రావాలంటే ఈ సమావేశానికి రావడమే. నాగార్జున చిరు ఇలా ఎవరిని ఎవరూ పిలవలేదు. ప్రభుత్వంతో సంప్రదించాలనుకుంటే వారే రావాలి.. అయినా బాలయ్య ఇలా మాట్లాడతారని అనుకోలేదంటూ కాస్త ఆవేశ పడ్డాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జబర్దస్త్ ని వదిలేసి.. కామెడీ అవడమే కాదు.. రాజకీయాల్లోనూ తలా తోక లేని మాటల్తో అందరిని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాడు. గతంలో బాలకృష్ణ పై యు ట్యూబ్ వీడియోస్ రూపంలో హల్చల్ చేసిన నాగబాబు కి ఇప్పుడు బాలకృష్ణ మరోసారి నోటికి పని కలిపించాడు.
బాలయ్య వ్యాఖ్యలుకు నాగబాబు కౌంటర్ గా బాలకృష్ణ నోరు జారొద్దు.. నోరు అదుపులో పెట్టుకో… సమావేశలకు ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అంటూ కౌంటర్ వేసాడు నాగబాబు. హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలు బాధాకరం అన్నాడు నాగబాబు. అసలు ఇలాంటి వ్యాఖ్యలను బాలయ్య వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు.. సినిమా పరిశ్రమకి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని నాగబాబు డిమాండ్ చేస్తున్నాడు. బాలకృష్ణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని…. బాలయ్య మాట్లాడింది చాలా తప్పని చెప్పాడు. దాంతో బాలయ్య అభిమానులు బాలయ్య మరోసారి నాగబాబు నోటికి పని చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.