Fri Dec 05 2025 15:54:50 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ సెలబ్రిటీస్ పై బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు
యూపీలోని మొరాదాబాద్ లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ బాలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో ఉన్న స్టార్లలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని చెప్పారు. సల్మాన్ ఖాన్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పడం కలకలం రేపుతోంది. అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదన్న బాబా రాందేవ్.. షారుఖ్ ఖాన్ తనయుడు మాత్రం డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని జగమెరిగిన సత్యాన్ని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కారణంగానే అతను జైలుకి కూడా వెళ్లాడన్నారు.
ఇక నటీమణుల విషయానికొస్తే వారి విషయం దేవుడికే తెలియాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ప్రపంచం విస్తరించి ఉందని, రాజకీయ రంగంలోనూ మత్తు పదార్థాలు వాడుతుంటారని అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు మద్యం పంచడం అందరికీ తెలిసిందేనన్నారు. డ్రగ్స్ బారి నుంచి భారత్ కు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు.
Next Story

