Sat Oct 12 2024 15:27:49 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నికృష్ణపై దాడికి యత్నం.. పోలీసులకు ఫిర్యాదు
శంకర్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో.. చిన్నికృష్ణ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్..
ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణపై కొందరు రియల్టర్లు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై చిన్నికృష్ణ శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా.. చిన్నికృష్ణపై దాడికి ఒక భూ వివాదమే కారణమని తెలుస్తోంది. శంకర్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో.. చిన్నికృష్ణ హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు అతనిపై దాడికి యత్నించడమే కాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారని చిన్నికృష్ణ తెలిపారు.
Also Read : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్
కోవిడ్ తో ఇబ్బంది పడుతున్న తనను.. ఇంట్లోకి చొచ్చుకుని వచ్చి మరీ బెదిరించారని చెప్పుకొచ్చారు చిన్నికృష్ణ. స్థానిక గ్రామపంచాయతీ వాళ్లు తన స్థలానికి క్లియర్ పిక్చర్ ఇచ్చినా.. కావాలని వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కాగా.. చిన్నికృష్ణపై దాడి విషయం తెలిసి.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు చిన్నికృష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు.
News Summary - Attack on Famous Telugu Writer Chinni Krishna
Next Story