Tue Oct 08 2024 01:43:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్కి షారుఖ్ ఖాన్ 'జవాన్'.. దర్శకుడు కామెంట్స్ వైరల్..
జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. అట్లీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆస్కార్ గురించి మాట్లాడాడు.
RRR సినిమా ఆస్కార్ కి వెళ్లడం, అక్కడ 'నాటు నాటు' సాంగ్ తో ఆస్కార్ ని అందుకోవడంతో.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు మేకర్స్ తమ సినిమాలను కూడా ఆస్కార్ కి తీసుకు వెళ్తామంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీని కూడా ఆస్కార్ కి తీసుకు వెళ్తామంటూ దర్శకుడు అట్లీ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. అట్లీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఆస్కార్ గురించి మాట్లాడాడు.
"ఒక మూవీ మేకింగ్ వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. నటీనటులు నుంచి టెక్నీషియన్ వరకు తమ కష్టానికి ప్రతిఫలంగా అవార్డులు రావాలనే కోరుకుంటారు. నేషనల్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్కార్.. ఇలా ఏ అవార్డు వచ్చినా అంతా సంతోషిస్తారు. ఈక్రమంలోనే జవాన్ సినిమాని ఆస్కార్ కి తీసుకు వెళ్లాలని నాకూ ఒక కోరిక ఉంది. ఈ విషయం గురించి షారుఖ్ ఖాన్ తో కూడా చర్చిస్తాను" అంటూ వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజెన్స్ ఈ కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తాను అంటూ కూడా అట్లీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మూవీలోని విక్రమ్ రాథోర్ పాత్రకి బాగా క్రేజ్ రావడంతో.. ఆ రోల్ తో జవాన్ 2 ని తెరకెక్కిస్తాను అంటూ అట్లీ పేర్కొన్నాడు. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.858 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. త్వరలోనే ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని కూడా అందుకోనుంది. ఆల్రెడీ వెయ్య కోట్ల క్లబ్ లో షారుఖ్ 'పఠాన్' మూవీ ఉంది. ఇప్పుడు జవాన్ కూడా ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే.. 1000 కోట్లు చిత్రాలు రెండు ఉన్న హీరోగా షారుఖ్ కొత్త రికార్డుని క్రియేట్ చేస్తాడు.
Next Story