Sun Oct 06 2024 01:06:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆరుపదుల వయసులో విలన్ రెండోపెళ్లి
లన్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆరుపదుల వయసులో..
ప్రముఖ విలక్షణ నటుడు, విలన్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆరుపదుల వయసులో ఆయన ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్ అయిన రూపాలి బరోవా అనే మహిళను పెళ్లాడారు. ఆశిష్ విద్యార్థి అనే కంటే.. పోకిరి విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతకుముందు కూడా ఆయన పలు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి.. పోకిరి సినిమాలో పోలీస్ విలన్ పాత్రతో ఎక్కువ గుర్తింపు వచ్చింది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్ పురి భాషల్లో 300 కు పైగా సినిమాల్లో నటించారు. 11 భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రికార్డు ఆయన సొంతం. తెలుగులో పాపే నా ప్రాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. పోకిరి, గుడుంబా శంకర్, అలా మొదలైంది, ఇటీవలే వచ్చిన రైటర్ పద్మభూషణ్ తదితర చిత్రాలతో పాపులర్ అయ్యారు. రానా నాయుడు వెబ్ సిరీస్ లోనూ విలన్ గా నటించారు.
మే 25న అశిష్ విద్యార్థి రూపాలీని పెళ్లాడారు. అంతకుముందు వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ఆమెను బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడి.. అందరికీ షాకిచ్చారు. వీరి పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. రూపాలి విషయానికొస్తే.. ఆమెకు కోల్ కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయట.
ఆశిష్ విద్యార్థి 20 ఏళ్ల క్రితం బెంగాలీ నటి రాజోషిని వివాహం చేసుకున్నారు. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ అండ్ సింగర్. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. విడాకులు అయినప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్న ఆయన.. మళ్లీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో పెళ్లేంటని కొందరంటే.. కొందరు మాత్రం కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Next Story