Sun Dec 28 2025 07:32:39 GMT+0000 (Coordinated Universal Time)
‘అరవింద సమేత’పై నిరసనలు

అరవింద సమేత వీరరాఘవ సినిమాలో రాయలసీమను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆరోపించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో సమితి నేతలు మాట్లాడుతూ... సీమలో ఎప్పుడో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ రెచ్చగొట్టేలా ఈ సినిమాను చిత్రీకరించారని వారు ఆరోపించారు. ఈ సినిమాలోని డైలాగులు, సన్నివేశాలు రాయలసీమను తప్పుగా అర్థం చేసుకునేలా ఉన్నాయన్నారు. రాయలసీమపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ కక్ష కట్టినట్లుగా సినిమాలు తీస్తున్నారని పేర్కొన్నారు. సీమపై అభ్యంతరంగా ఉన్న డైలాగులు, సన్నివేశాలు వెంటనే తొలగించాలని లేకపోతే రాయలసీమలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Next Story

