Sat Dec 07 2024 23:54:52 GMT+0000 (Coordinated Universal Time)
Anupama Parameswaran: స్టేజిపై దర్శకుడికి రాఖీ కట్టిన అనుపమ.. ఎందుకు..!
అనుపమ పరమేశ్వరన్ తో ఒక దర్శకుడికి బహిరంగంగా రాఖి కట్టించారు. ఇంతకీ అసలు ఏమైంది..?
Anupama Parameswaran: అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిఒక్కరు క్రష్ లిస్టులో ఆమె పేరు కూడా ఉంటుంది. ఆమె పొరపాటున ఎవర్ని అయినా.. అన్నయ్య అని పిలిస్తే వారి గుండె పగిలిపోతుంది. ఇంక రాఖి కడితే.. ప్రాణం పోయినట్లే. తాజాగా ఈ భామతో ఒక దర్శకుడికి బహిరంగంగా రాఖి కట్టించారు. ఇంతకీ అసలు ఏమైంది..?
ప్రస్తుతం అనుపమ, రవితేజ 'ఈగల్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. దర్శకుడిని అన్నయ్య అని పిలిచింది. ఇక అది విన్న రవితేజ.. 'మీలాంటి అందమైన అమ్మాయిలు అబ్బాయిలని అన్నయ్య అని పిలవకూడదు' అని చెప్పారు. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అనుపమ స్టేజి పై ఉండగా.. ఆ వీడియోని ప్లే చేశారు. అది చూసిన అనుపమ బదులిస్తూ.. ''ఆయనతో నాలుగేళ్లు పని చేశా. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకనే అన్నయ్య అని పిలవడం అలవాటు అయ్యిపోయిందని'' అని చెప్పారు. దీంతో ఆ స్టేజి పైనే అనుపమతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి రాఖి కట్టించారు.. మూవీ యూనిట్.
కాగా ఈగల్ సినిమా ఈ శుక్రవారం ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో కావ్య తాపర్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. నవదీప్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
Next Story