Sat Dec 07 2024 23:44:36 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా హిట్ అయినా.. హ్యాపీగా లేనంటున్న అనుపమ !
స్టేజ్ మీద తాను ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదని చెప్పింది. "స్టేజ్ పైకి వచ్చేటపుడు నాలో షివరింగ్ మొదలైంది. సినిమా హిట్..
నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ఆగస్టు 13న విడుదలైన కార్తికేయ 2 సూపర్ సక్సెస్ అందుకుంది. ఐదురోజులుగా ఈ సినిమాకు ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు సహా ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఓవర్సీస్ లోనూ విశేష ఆదరణ దక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో.. చిత్రబృందం వరుసగా సక్సెస్ మీట్స్ పెట్టి మరింత ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా కార్తికేయ 2 బృందం సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. స్టేజ్ మీద తాను ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదని చెప్పింది. "స్టేజ్ పైకి వచ్చేటపుడు నాలో షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయినా నువ్వెందుకు సంతోషంగా లేవని నా ఫ్రెండ్స్ అడిగారు. నిజమే నిజమే సినిమా హిట్ అయినా నేను హ్యాపీగా లేను. ఎందుకంటే సినిమా హిట్ అయిన ఆనందం కంటే కూడా కార్తీకేయ-2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధవల్లే నేను హిట్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఒక మంచిసినిమాలో నాకు అవకాశం ఇచ్చి.. ఇన్ని రోజులు నన్ను భరించిన దర్శకుడు చందూ మొండేటికి, సినిమాను ఆదర్శిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు" తెలిపింది.
News Summary - anupama parameswaran not happy with kartikeya 2 success
Next Story