Fri Dec 05 2025 15:37:45 GMT+0000 (Coordinated Universal Time)
హీరో నిఖిల్ కామెంట్స్ కు.. అనుపమ పరమేశ్వరన్ రిప్లై
ప్రమోషన్లు అనగానే హీరోయిన్ కనిపించదన్న నిఖిల్.. స్పందించిన అనుపమ

హీరో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'కార్తికేయ2'. 'కార్తికేయ' సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీకేయ 2ను జూలై 22న విడుదల చేయాల్సి ఉండగా.. నాగచైతన్య నటంచిన 'థాంక్యూ' అదే రోజున వస్తుండడంతో 'కార్తికేయ2' టీమ్ ని వాయిదా వేశారు. ఇక ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
కార్తీకేయ టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా నిఖిల్ హీరోయిన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. సినిమా షూటింగ్ అంటే చాలా ఉత్సాహంగా కనిపించే అనుపమ, సినిమా ప్రమోషన్లనగానే మాయమైపోతుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ప్రమోషన్లకు హీరోయిన్ రాదని నిఖిల్ విమర్శలు గుప్పించడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
'కార్తికేయ 2' చిత్రం ప్రమోషన్స్‌లో కనిపించకపోవడంతో అనుపమ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడానికి కారణం తాను మరో రెండు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తూ ఉండడమేనని ఆమె వివరించారు. ప్రస్తుతం నేను రెండు సినిమాల చిత్రీకరణలతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని ఆమె వివరించారు. ఇతర నటీనటులతో కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణకు ఎప్పుడో షెడ్యూల్ చేశారని.. అంతేకాకుండా తాను 'కార్తికేయ 2' ప్రమోషన్స్‌కి కూడా ప్లాన్ చేసుకున్నానన్నారు. కార్తికేయ-2 విడుదల పలుమార్లు వాయిదా పడడంతో షెడ్యూల్ మొత్తం తారుమారైందని.. నా షెడ్యూల్ కాస్త టైట్ అవ్వడం వల్ల ప్రమోషన్స్‌లో ఎక్కువగా కనిపించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. దయ చేసి నా కష్టాన్ని అర్థం చేసుకోండని అనుపమా పరమేశ్వరన్ తెలిపారు.
2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తోంది. అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Summary - heroine anupama parameshwaran reply to hero nikhil comments
Next Story

