Sun Jun 22 2025 12:43:48 GMT+0000 (Coordinated Universal Time)
Akhanda : బాలయ్య "అఖండ" మూవీకి చెందిన కీ అప్ డేట్ ఇదే
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 మూవీకి సంబంధించి తాజాగా మరో అప్ డేట్ వచ్చేసింది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 మూవీకి సంబంధించి తాజాగా మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో జూన్ నెల 10వ తదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ రోజు అఖండ 2 మూవీకి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేయనున్నారు. అయితే మేకర్స్ దీనిపై స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ బాలయ్య బర్త్ డే కు ఖచ్చితంగా టీజర్ తో ఫ్యాన్స్ కు మంచి ఊపు తెచ్చేలా టీజర్ ను విడుదల చేయనున్నారని సమాచారం.
జార్జియాలో షూటింగ్...
ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ షూటింగ్ జార్జియాలో జరుగుతుంది. గత కొద్దిరోజులుగా బాలయ్య అక్కడే ఉన్నారు. మహానాడుకు కూడా బాలకృష్ణ హాజరు కాకపోవడానికి అదే కారణం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూే ఉన్నాయి. అఖండ్ పార్ట్ 1 లాగానే సీక్వెల్ కూడా బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. అందులోనూ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ పట్ల అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
దసరాకు రిలీజ్ చేయాలని...
మరొకవైపు ఈ అఖండ 2 సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించారు. అనుకున్న సమయానికి థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ చేస్తున్నారు. అందుకే శరవేగంతో షూటింగ్ చేస్తున్నారు. ఇందులో సంయుక్తా మీనన్ తో పాటు ఆది పినిశెట్టి లు కూడా నటిస్తున్నారు. జార్జియాలో భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. జార్జియాలో షూటింగ్ పూర్తయిన వెంటనే ఇక్కడ కూడా షూటింగ్ ను చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలన్న యోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఈ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Next Story