Sun Feb 01 2026 22:43:27 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ కు షాక్.. దర్శకుడు మృతి
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత దర్శకుడు మదన్ మృతి చెందారు.

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత దర్శకుడు మదన్ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్న మదన్ ఆదివారం తెల్లవారు జామున మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే మదన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రచయిత, దర్శకుడిగా...
మదన్ మరణంతో టాలివుడ్ లో విషాదం నెలకొంది. మదన్ ప్రముఖ రచయితగా టాలీవుడ్ లో సుపరిచితులు. ఆ నలుగురి చిత్రంతో రచయితగా మారినమదన్ పెళ్లయిన కొత్తల్లో దర్శకుడిగా మారారు. మదన్ ప్రవరాఖ్యుడు, గుండె ఝల్లుమంది, ప్రవాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మదన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా. మదన్ భౌతిక కాయానికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
Next Story

