Sat Dec 06 2025 07:52:31 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత బాలమురుగన్ మరణించారు

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత బాలమురుగన్ మరణించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి బాలమురుగన్. ఆయన వయసు 86 సంవత్సరాలు. తన తండ్రి మరణించినట్లు భూపతి రాజా వెల్లడించారు.
తెలుగు, తమిళం...
బాలమురుగున్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు కధలను అందించారు. జీవనతరంగాలు, సావాసగాళ్లు, సోగ్గాడు, ఆలుమగలు, ధర్మదాత వంటి చిత్రాలకు కధలు రాసింది బాలమురుగన్. తమిళంలో శివాజీ గణేశన్ సినిమాలకు ఎక్కువగా కథలను అందించారు బాలమురుగన్. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story

